ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా రియాల్టర్ అసోసియేషన్ ఆఫీస్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్
ప్రధాన కార్యదర్శి- పగడాల రంగారావు
క్రీడాయ్ జిల్లా అధ్యక్షులు-బండి కిషోర్
బిల్డర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా జనరల్ సెక్రెటరీ-వాసిరెడ్డి నాగేశ్వరరావు
తదితరులు పాల్గొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసి వారు మాట్లాడుతూ ఇప్పటివరకు రియాల్టర్ గా చేస్తున్నవారు ప్రత్యక్షంగా పరోక్షంగా గవర్నమెంట్ కి 7% టాక్స్ రూపంలో నిధులు ఇస్తున్నామని మనమందరము గౌరవముగా సమాజంలో ఎదుగుతున్న వాళ్లమని కొనియాడారు.ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని కూడా ఎవరిమీద ఆధారపడకుండా స్వధాగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ ఎంతోమందికి మార్గదర్శకులుగా ఉన్నారు అని తెలియపరిచారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా యూనియన్ పరంగా ఎంతో ముందంజలో ఉంది అని కొనియాడారు.నేడు 1000 మంది బైక్ ర్యాలీలతో మన యొక్క రియల్టర్ అసోసియేషన్ జెండాను ఖమ్మం పట్టణం నలుమూలల* రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి తెలియపరిచే రీతిగా ఈ ర్యాలీ* ఉండబోతందన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు అన్నం వీర ప్రసాద్ రావు
ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ – కాటేపల్లి జనార్దన్ రావు గారు*
ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా – ఏలూరు రాము
ఖమ్మం జిల్లా ప్రచార కార్యదర్శి – మాతంగి అనిల్ కుమార్
ఖమ్మం జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ – బానోతు సత్యం
జిల్లా ఉపాధ్యక్షులు అల్లిక సంతోష్ యాదవ్ తుప్పతి శ్రీనివాస్ రావు
జిల్లా కార్యదర్శిలు మంద ఉషారాణి దనియాకుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.