చింతలకుంట బఫర్ జోన్ లో రెడిమేంట్ సిమెంట్ పలకలతో… భారీ కాంపౌండ్ వాల్ అక్రమ నిర్మాణం

చింతలకుంట బఫర్ జోన్ లో రెడిమేంట్ సిమెంట్ పలకలతో…
భారీ కాంపౌండ్ వాల్ అక్రమ నిర్మాణం…..

గండి మైసమ్మ మండల పరిధిలో కుంటలు కబ్జాదారుల దహానికి పోతున్నాయి….

కబ్జాదారుల అడ్డుకొని కాపాడవలసిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్లు చర్యలు మాత్రం శూన్యం….

మేడ్చల్, అక్షిత బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణకు పకడ్బందీగా భూ సవరణలో చేపడుతున్న ప్రభుత్వం నీటి వనరులను పరిరక్షించుకోవాలని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో విన్నాం కానీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధి డి పోచంపల్లి చింతలకుంట బఫర్ జూన్ లో రెడీమేడ్ సిమెంట్ పలకలతో భారీ కాంపౌండ్ వాల్. అక్రమ నిర్మాణం జరుగుతున్న రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి చర్యలు మాత్రం చేపట్టడం లేదు చింతలకుంట సర్వే నెంబర్74 విస్తీర్ణ12 ఎకరాలు 17 గుంటలు ఇరిగేషన్ అధికారి వర్క్ ఇన్స్పెక్టర్ కు స్థానికులు సమాచారం అందించగా పరిశీలన చేసి రిపోర్ట్ రెవెన్యూ అధికారులు పంపించగా రెవెన్యూ అధికారులు సర్వే తో పరిశీలన చేసి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది వినికిడి ఇదే విషయంపై మీడియా వివరణ: కోరగా తాసిల్దార్ పద్మప్రియ ధరణి బిజీలో ఉండగా. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ని వివరణ: కోరగా ఇరిగేషన్ అధికారులు రిపోర్టు పంపించింది వాస్తవమే సర్వే సెలవులో ఉండగా పరిశీలన చేయలేకపోయాము వచ్చిన తర్వాత వెంటనే సర్వేతో పరిశీలన చేసి చర్యలు తప్పకుండా తీసుకుంటాం అని అన్నారు. గండిమైసమ్మ మండల పరిధిలో బఫర్ జోన్ లో ఏపిటిఎల్ లో కొన్ని సర్వే నెంబర్లలో ప్రభుత్వ స్థలాలు కాపాడటంలో రెవెన్యూ అధికారులు విఫలమై పోతున్నారు విమర్శలు గుప్పుమంటున్నాయి వార్తా కథనాలు రాసిన చర్యలు మాత్రం శూన్యం ప్రజాప్రతినిధుల జంకుతో వణుకుతున్న టు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ జల
వనరులు అంతరించిపోకుండా పరిరక్షించలి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking