కబ్జాదారుల నుండి సిద్దిపేటను రక్షించండి◆ చెరువులను కబ్జా చేస్తున్న పట్టించుకోని మున్సిపల్ అధి కారులు ◆
కబ్జాదారుల నుండి సిద్దిపేటను రక్షించండి
◆ చెరువులను కబ్జా చేస్తున్న పట్టించుకోని మున్సిపల్ అధి కారులు
◆ సేవ్ సిద్దిపేట పేరుతో ఉద్య మిస్తాం
◆ సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్ట ణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్దిపేట అక్షిత ప్రతినిధి : సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ, చెరువు శిఖం భూములనుకబ్జా చేస్తున్న స్థలాల్లో మున్సిపల్, రెవెన్యూ అధికారులు,మున్సిప ల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ల వా టా ఎంతో ప్రజలకు వివరించాల ని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్ట ణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు.శనివారం సి ద్దిపేట పట్టణంలో సిద్దిపేట కాం గ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వానికి చెంది న స్థలాలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు,అదికార పార్టీకి చెందిన నాయకులు య దేచ్ఛగా కబ్జాలు చేస్తున్న పట్టిం చుకునే వారే కరువయ్యారని అన్నారు.ప్రభుత్వ భూములను చెరువులను రక్షించాల్సిన అధి కారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.

సిద్ది పేట పట్టణంలోని ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువు వద్ద బహి రంగంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువును మట్టి తో పూడ్చి వేశారని అన్నారు. అట్టి స్థలంలో అపార్ట్మెంట్లు,వి ల్లాలు కట్టుకునేందుకు మున్సి పల్ అధికారులు అనుమతిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ము న్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అవినీతికి పాల్పడుతూ అడ్డగో లుగా అనుమతులు ఇస్తున్నార ని ఆరోపించారు.పట్టణం విస్తరి స్తున్న సమయంలో కొందరు రి యల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇ దే అదునుగా భావించి ఇష్టాను రీతీగా కబ్జాలకు పాల్పడుతు న్నారని మండిపడ్డారు.రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇప్పటి కైనా స్పందించి ప్రభుత్వ భూమి ని సంరక్షించాలని డిమాండ్ చే శారు.లేకపోతే దీనిపై మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకె ళ్తామని సూచించారు.అధికా రులు ఇప్పటికైనా స్పందించ కుంటే సేవ్ సిద్దిపేట పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉ ద్యమిస్తామని ఘాటుగా హెచ్చ రించారు.ఈ కార్యక్రమంలో ఫ యాజుద్దీన్,గయాజుద్దీన్,రాజే ష్ తదితరులు పాల్గొన్నారు.