తూతూ మంత్రంగా గ్రామసభ
సర్పంచ్, కార్యదర్శుల తీరుపై ప్రజలు ఆగ్రహం
మరిపెడ అక్షిత ప్రతినిధి: మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలోని తూతూ మంత్రంగా శనివారం గ్రామసభ జరుగుతుంది. ఈ గ్రామసభలో వార్డ్ నెంబర్లు అందరూ, అధికారులు, ఎవరు రాలేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామ అభివృద్ధి గురించి గానీ ఇంతగా ముందు చర్చించిన అంశాల గురించి గానీ ఎలాంటి విషయాలు చర్చించ కుండ గ్రామ సభను ముగిస్తున్నారు. గ్రామంలో గ్రామ సర్పంచి నూకల కిషన్ రెడ్డి, సెక్రటరీ వెంకన్న అంతా మా ఇష్టం అని మాకు ఎవరు ఎదురు చెప్పేది లేదు అని వ్యవరిస్తున్నరు.గ్రామ సర్పంచ్,కార్యదర్శి పై గుండెపుడి గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.