ప్రజల భద్రత, రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యం
రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి
మంచిర్యాల అక్షిత బ్యూరో: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ, ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నూతన కమిషనర్ గా రెమా రాజేశ్వరి ఐపిఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన పోలీస్ కమిషనర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. రామగుండం కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ, న్యాయాన్ని, ధర్మాన్ని లోబడి చట్టబద్దంగా సామన్య ప్రజలకు తనతో పాటు తమ అధికారుల చేతకూడ సేవలందిచడంలో కృషి వేస్తానని అన్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని ఏసిపి లతో సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను, ఎక్కువ గా నమోదు ఉన్నటువంటి కేసుల వివరాలను అడిగి తెలుసుకొవడం జరిగిందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలను దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా ఉంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని అన్నారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని వ్యక్తిగత దూషణకు పాల్పడితే చర్యలు తప్పావని, ఎవరైనా సామన్య ప్రజలను ఎవరైన వ్యక్తిగతంగా చేసుకోని సామాజిక మాధ్యమాల ద్వారా చేదు ప్రచారం చేసిన వ్యాక్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, విద్వేషాలను రెచ్చగోట్టేవారిని పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ ను కలిసి పుష్పాగుచ్చాలను అందజేసిన వారిలో ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, సీపీ సిసి శ్రవణ్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచ లింగం, సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.