డైరెక్టర్ (పా)చంద్రశేఖర్ సేవలు మరువలేనివి
* కొనియాడిన టీబీజీకేఎస్ రజాక్ బృందం
* డైరెక్టర్ చంద్రశేఖర్ కు ఘన సన్మానం
* సందడిగా మారిన రామవరం టీబీజీకేఎస్ కార్యాలయం
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి: రామవరం టీబీజీకేఎస్ కార్యాలయం నందు కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీలో సుదీర్ఘకాలం విధి నిర్వహణలో వివిధ హోదాలలో విధులు నిర్వహిస్తూ రిటైర్మెంట్ అవుతున్న డైరెక్టర్ ఆపరేషన్ డైరెక్టర్ (పా)ఎస్.చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి టీబీజీకేస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని వారికి పూల బొకేలతో పూల దండలు వేసి శాల్వలతో ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియాలో వి.కే-7 మైన్ మూతపడిన అక్కడ ఉద్యోగులను ఇక్కడే ఉండే విధంగా డైరెక్టర్ చంద్రశేఖర్ సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో క్వారంటెన్ సెంటర్లు, త్వరితగతిన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ డోస్ ఇప్పించడం జరిగిందని తెలిపారు.

సత్తుపల్లిలో క్వార్టర్స్ (డబల్ బెడ్ రూమ్) ఉద్యోగులు ఇబ్బంది పడకుండా చొరవ తీసుకొని త్వరితగతిన పూర్తి చేయించినట్లు చెప్పారు. టీబీజీకేస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11 మెన్ కమిటీ సభ్యులు కాపుకృష్ణ, రీజనల్ సెక్రెటరీ కూసాన వీరభద్రం, నాయకులు చిలక రాజయ్య, ఎస్కే గౌస్, ఎం.డి. సత్తార్ పాష, శనగరపు కుమార్, శనిగరపు శంకర్, నటరాజ్, నర్సింగం, ఏ.సదానందం, నిమ్మల రాజేశ్వరరావు, బుడిగ రాజేశ్వరరావు, జల్లి కిరణ్, వల్లాల శంకర్, లింగాల జోసెఫ్, వెజ్జల శ్రీనివాస్, డి.శంకర్ బాబు, నాగ మోహన్, రాంసింగ్, ఎం. కొమురయ్య, శంకర్, సూరిబాబు, కే కుమార్, శ్యాంబాబు, కొండల్, భరత్, సత్యశివరాం, రుక్మిందర్,పోశంశ్రీనివాస్, చంద్రమోహన్, గులాం గౌస్, తిరుపతి, దరియాసింగ్, అశోక్, పి.ఆర్.సి.రెడ్డి, ఈశ్వర్, హైదర్ అలీ, శ్రీనివాస్, గోపాల్, శ్రీకాంత్, నరేష్, నాగేశ్వరరావు, ప్రభాకర్, రమేష్, వినయ్, రాంధాని, త్రిపాటి, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, డిఎల్ఆర్ కార్మికులు, మిత్రులు శ్రేయోభి లాషులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.