భారీగా బారాసాలో యువ నాయకులు చేరికలు

భారీగా బారాసాలో యువ నాయకులు చేరికలు

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:

ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో కొత్తపేట డివిజన్ యువ నాయకులు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ లోని దాదాపు 100 మంది యువకులు, మంగళవారం, బి.ఆర్.ఎస్.పార్టీలోకి పార్టీ కండువా కప్పి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బారాస పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ఇట్టి పార్టీలో చేరిక కావడం జరిగింది అని తెలిపారు. బి.ఆర్.ఎస్. పార్టీ ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను పార్టీ సాధించిందని తెలిపారు. గడిచిన సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అద్భుతాలు సాధించింది. విజయాల దిశగా దూసుకెళ్లింది. మంచినీరు, సాగునీరు, సంక్షేమం, విద్యుత్,వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు అందుకుంది.బి.ఆర్.ఎస్.పార్టీ సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఠాగూర్
రోహన్ సింగ్, ఠాగూర్ వినయ్ కుమార్ సింగ్, ఠాకూర్ మోహిత్ సింగ్, సాయి వర్ధన్,గోపాల్, వంశీ, వర్షిత్, ప్రాణవ్,జీవన్, విక్కీ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking