సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, మరియు సంఘ సేవకుడు, మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు.
ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:
మంగళవారం, మహాత్మ జ్యోతిరావు పూలే 196 వ జయంతి సందర్భంగా ఎల్.బి.నగర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కోసం చేసిన కృషికి ఆయనకు ,”మహాత్మా”బిరుదు ఇచ్చారు, 1848 లో బాలికల కోసం మొదటి పాఠశాలను పూణేల్లో ప్రారంభించారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. అతను భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన ,అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడారు అని తెలిపారు. వారు చూపించిన, ఆచరించిన ,మార్గాలు ,నేటి యువత ,రాబోయే తరాలకు ఆదర్శనీయమని వాటిని ఆచరించటం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు బారాస సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.