మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే ప్రియదర్శిని మేడి
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
జ్యోతిరావు పూలే మహనీయుడని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మంగళవారం చిట్యాల మునిసిపల్ పరిధిలో శివనే గూడెం లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే మహారాష్ట్రలోని పూణేలో, 1873 సెప్టెంబరు 24లో స్థాపించిన సాంఘిక సంస్కరణ సమాజము అణగారిన వర్గాల వారికి, శూద్రులకు, దళితులకు, ముఖ్యంగా మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ఈ సమాజపు ముఖ్య ఉద్దేశమన్నారు. జ్యోతీరావు పూలే భార్య సావిత్రి బాయి పూలే మహిళా సమాజ విభాగానికి నాయకత్వం వహించేవారని అన్నారు. జ్యోతిరావు పూలే జీవితం ఈ దేశ ప్రజలకు ఆదర్శం అని కొనియాడారు. తదుపరి కాలంలో డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ పూలేని ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఆనాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడని అన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ చదువుకోవాలని పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు,శివనేనిగూడెం బూత్ అధ్యక్షులు రుద్రవరం కుమార్, మున్సిపాలిటీ నాయకులు గ్యార శేఖర్, ఏర్పుల నితిన్, ఎల్లమ్మ, అనిత, మారమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.