పేదరికం విజయానికి అడ్డు కాదు

పేదరికం విజయానికి అడ్డు కాదు

పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థినీ తన్మయికి అభినందనలు

షేక్ బాజీ బాబా
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు

-తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మం పట్టణంలోని 32 వ డివిజన్ కు చెందిన నైనారపు ప్రసాద్ -లక్ష్మీ ప్రసన్న దంపతుల కుమార్తె తన్మయి పదవ తరగతి పరీక్షలలో 548 మార్కులు సాధించిన సందర్భంగాఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.కోరిపల్లి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికం సైతం లెక్కచేయకుండా పట్టుదలతో అత్యధిక మార్కులు సాధించడం గర్వకారణం అని ఇదే పట్టుదలతో రాబోయే రోజుల్లో కూడా
ఇదే స్ఫూర్తి పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన్మయి కి స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.చదువుకు పేదరికం అడ్డు కాదని పట్టుదలతో విజయాలను సాధించవచ్చని ఉన్నతరంగాలకు వెళ్లగలమని ఎక్కడ అధైర్య పడకుండా పట్టుదలతో చదువులు కొనసాగించి రాబోయే రోజుల్లో విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కుక్కల రామకృష్ణ పగిడిముక్కుల విజయ్ కాంపాటి ఉపేందర్ దుబాయ్ శ్రీను పిల్లిగుండ్ల ముత్తయ్య తోళ్ల రాకేష్ తంబర్ల వెంకట కర్ణ తోల శివ రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking