గ్రామ పెద్దలతో కలిసి బడిబాట కార్యక్రమం

గ్రామ పెద్దలతో కలిసి బడిబాట కార్యక్రమం

 తల్లిదండ్రులలో అపూర్వ స్పందన.

రామన్నపేట అక్షిత ప్రతినిధి  

ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా గత నెల 25న పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించి గ్రామస్తులకు బడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి తిరిగి నేడు గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామ పెద్దలతో కలిసి ప్రాథమిక & ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు , ఉపేందర్ జి కలిసి వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను ప్రభుత్వ బడిలోనే అందిస్తామని , వేలకు వేలు ఫీజులు కట్టి , తల్లిదండ్రులు మోసపోవద్దని సర్వతో ముఖాభివృద్ధితో పాఠశాలకు దాతల సహకారంతో దినదినం అభివృద్ధి చెందుతుందని ఈ సంవత్సరం పదిమందికి గురుకులాలలో సీట్లు రావడం పట్ల తల్లిదండ్రులలో ఉత్సాహం నింపిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు రాజన్ బాబు , శ్రీనివాసరావు , జ్యోతి , కృష్ణ , గోపాల్ రెడ్డి , స్వర్ణలత , గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ , ఉప సర్పంచ్ నడిగోటి పాండు , ఏఏపిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ , గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి , మడూరి సోమేశ్వరరావు , సామాజిక కార్యకర్త వేముల సైదులు , చిల్ల మధు , పిండి సైదులు , ఉపేందర్ , రాజు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking