రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల

రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల

రామన్నపేట అక్షిత ప్రతినిధి

రామన్నపేట పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ అసిస్టెంట్స్ (బిఎల్ఏ-2) మండల కార్యశాల నిర్వహించారు. మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నకిరేకల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ నకిరేకంటి మొగులయ్య, మండల ఇన్‌చార్జ్ కొరివి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 25న కట్టంగూరు మండలంలో జరగనున్న నకిరేకల్ నియోజకవర్గ స్థాయి బిఎల్ఏ-2 సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా వ్యవహరించడం మహిళల పట్ల అవమానకరమని అన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించడంలో కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, సీనియర్ నాయకులు డోగ్పర్తి సుభాష్, కట్ట యాదయ్య, యువమోర్చా జిల్లా కార్యదర్శి అక్కినపల్లి సైదులు, మండల ప్రధాన కార్యదర్శులు జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, ఉపాధ్యక్షులు బట్టే రమేష్, గజ్జల రాము, కార్యదర్శి బందెల సంజీవ, కోశాధికారి గురుకు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking