శిదిలావస్థకు చేరిన అసిఫ్ నగర్ కాలువ కట్టను మరమ్మత్తు చేయాలి
గుర్రపు డెక్క ఆకును తొలగిచి రైతుల సమస్యను పరిష్కరించాలి
సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
మునిపంపుల గ్రామ పరిధి అసిఫ్ నహర్ కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క ఆకును తొలగించి శిథిలావస్థకు చేరిన కాల్వకట్టను మరమ్మత్తులు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరుయాత్రలో భాగంగా గ్రామ నాయకత్వంతో కలిసి అసిఫ్ నగర్ (రాచకాల్వను) పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి నిరాటంకంగా ముసి నీరు వస్తుండడంతో తూటీకూర,గుర్రపుడెక్కాకు చెత్త అపరిస్కృతంగా చెట్లు పెరిగి నీరు వెళ్లకుండా సమీప పొలాల మీదుగా పోవడంతో అనేక మంది రైతులు పంటలను పడవా పెట్టుకోవడం జరిగిందని అన్నారు. కింది పొలాలు జాలుబట్టిపోయి దున్నడానికి, వరి చేను కోయడానికి చాలా ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. అధిక వర్షాలు సంభవించినప్పుడు గ్రామం మీదుగా రాచకాలువ నీరు కట్టమీద నుండి పొరలి ప్రమాదకరంగా మారుతుందని పలు సందర్భాల్లో కట్ట తెగి పంట పొలాలు నష్టం జరిగిందని అన్నారు.రైతుల పోరాటంతో నీటిని కొంత మేరకు ఆపడం జరిగింది కానీ ఇదే సందర్భంలో వెంటనే కాల్వలో పేరుకుపోయిన ఆకును తొలగించాలని. కట్టకు విరిగా పెరిగిన కంపచెట్లను తొలగించాలని మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన నీటి వనరు ఆసిఫ్ నగర్ కాలువ అని తీవ్రమైన సమస్యను ప్రభుత్వ అధికార యంత్రాంగం వెంటనే చొరవ తీసుకొని పరిష్కారం చేయాలని లేని పక్షంలో రైతులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తలుపునూరి శ్రీనివాస్, శాఖ కార్యదర్శి తాళ్లపల్లి జితేందర్,వార్డు సభ్యులు గంటెపాక శ్రీను, బూడిద నర్మదనర్సింహా,నాయకులు తొలుపునూరి చంద్రశేఖర్, గంటపాక శివకుమార్, మేడి ముకుంద,ఎండి మైనొద్దీన్, ఉండ్రాతి నరసింహ, బూడిద బిక్షం గునుగుంట్ల సత్యనారాయణ, మేడి భాషయ్య, గంటెపాక చిన్న ముత్యాలు,గంటెపాక శ్రీకృష్ణ,కనుకుంట్ల ఉపేందర్, పోగుల ఉపేందర్, బొడ్డుపల్లి ఉపేందర్, జంపాల మహేష్, బోనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
