నాగార్జున పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం “ఆరోహణ”
రామన్నపేట అక్షిత ప్రతినిధి
- మండల కేంద్రంలోని నాగార్జున పాఠశాలలో వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది “ఆరోహణ” అనే థీమ్‌ను ఎంపిక చేసి విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాల సాధనపై చైతన్యం కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్ సీఐ దుబ్బ కిషన్ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి విద్యార్థులు కృషితో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ కట్ట శేఖర్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించగా, డాక్టర్ నాగేశ్వరరావు పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. పీహెచ్‌డీ స్కాలర్ పి.శ్రీనివాస్ ప్లే వే మెథడ్ ద్వారా విద్యార్థులు సులభంగా నేర్చుకుంటారని తెలిపారు.పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు వార్షికోత్సవ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్రీమతి రేఖ వార్షిక నివేదికను సమర్పించి పాఠశాల విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు.కార్యక్రమంలో తల్లిదండ్రులు జిక్ర తబస్సుం, వసుంధర తమ అనుభవాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు అక్రమ్, సంతోష్, నరసింహ, సంధ్య, విజయ్ శ్రీ, వినిషలత తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()

