అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం. శ్రీరామబంటు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి అన్నదానాన్ని ప్రారంభిస్తున్న దేవాలయ చైర్మన్ జూకూరి అంజయ్య
అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం.
శ్రీరామబంటు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి
అన్నదానాన్ని ప్రారంభిస్తున్న దేవాలయ చైర్మన్ జూకూరి అంజయ్య
కోదాడ టౌన్, అక్షిత న్యూస్:
కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఇటీవల ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజ, పుష్పాలంకరణ వంటి పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు కనుల పండుగగా నిర్వహించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు, అన్నదాతల చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకురి అంజయ్య, సెక్రటరీ కోట తిరుపతయ్య, అన్నదాన నిర్వాహకులు దేవరశెట్టి హనుమంతరావు, దాతలు గుండా శ్రీనివాసరావు, జ్యోతి,మిరియాల.అచ్చయ్య, లక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, సత్యం, బ్యాటరీ చారి, వంశీకృష్ణ,ఓరుగంటి కృష్ణమూర్తి,వీరేపల్లి రామారావు, పెద్ది శేషు తదితరులు పాల్గొన్నారు.