ఏరియాలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయము నందు మంగళవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను బిసి సంక్షేమ సంఘం కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూలమాలనువేసి పూలతో పలువురు ఘనముగా నివాళులు అర్పించారు.

ఈ పలువురు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫులే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించారని పేర్కొన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందాలంటే విద్యను అభ్యసించాలని బాల్య వివాహా వ్యవస్థను నిర్మూలించటానికి పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమము నిర్వహించుటకు అనుమతి ఇచ్చినందుకు సింగరేణి బిసి సంక్షేమ సంఘము కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ బుడగమ్ రామ కృష్ణ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమములో సింగరేణి బిసి సంక్షేమ సంఘము కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ బుడగమ్ రామ కృష్ణ, టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఐటి మేనేజర్ శేషశ్రీ, పర్సనల్ మేనేజర్ డి.కిరణ్ బాబు, 11 మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, ఎన్విరాన్మెంట్ మేనేజర్ టి.సత్యనారాయణ, సీనియర్
పిఓలు జి.సుధాకర్, ఎం.మురళి, టిబిజికేఎస్ రీజనల్ సెక్రటరీ కుసాని వీరభద్రం, సింగరేణి బిసి సంక్షేమ సంఘము సెక్రటరీ సకినాల సమ్మయ్య, ఇతర యూనియన్ నాయకులు, జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.