ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో

అక్షిత ప్రతినిధి , నాగార్జునసాగర్

.ఐ సి డి ఎస్ అనుముల ప్రాజెక్ట్ పెద్దవూర మండల పరిధిలోని నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ మోడల్ హై స్కూల్ లో మంగళవారం నాడు “బేటి బచావో బేటి పడావో” కార్యక్రమాన్ని సిడిపిఓ గంధం పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలను పుట్టనివ్వాలని, ఎదగ నివ్వాలని ,చదివించాలని అన్నారు. బాల్య వివాహాలు,బాల్య కార్మికత ,పౌష్టికాహార లోపం ,రక్తహీనత ,లింగ వివక్షత ,అత్యాచారాలు లాంటి అభివృద్ధికి నిరోధకాలుగా ఉన్న ఇటువంటి వాటిని అధికమించి ప్రభుత్వము కల్పించే సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు .

రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోవడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 1098 ప్రచారంలో ఉంచి పిల్లలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు . అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గౌస్య బేగం ,ఉపాధ్యాయులు రవికుమార్ ,రవీంద్ర కుమార్, శంకరయ్య ,నాగ పద్మ ,రమణ ,స్పందన ,కోటేశ్వరి ,ఉమా ,శారద ,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking