ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి * జిల్లా కలెక్టర్ అనుదీప్

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

* జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

ఈ నెల 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కార్యక్రమానికి జిల్లా నుండి వెళ్తున్న ప్రజలకు
ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. హైదరాబాదు
ప్రయాణానికి బస్సులు, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు తదితర సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుండి
రెవిన్యూ, పంచాయతీరాజ్, ఉపాధికల్పన, పరిశ్రమలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్టీసి అధికారులతో టెలికాన్ఫరెన్సు
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులు 13వ తేదీ రాత్రి నియోజకవర్గ తహసిల్దార్ కార్యాలయంనకు
చేరుకునే విధంగా పంపాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లును డిపిఓ, జడ్పి సిఈఓ పర్యవేక్షణ చేయాలని
చెప్పారు. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఇద్దరు జిల్లా అధికారులను, ఇద్దరు తహసిల్దారులకు బాధ్యతలు
అప్పగించినట్లు చెప్పారు. ప్రయాణంలో ప్రజలకు మంచినీరు, మజ్జిగ, స్నాక్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. నార్కెట్పల్లి
శబరి గార్డెన్లో బోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధికల్పనాధికారి విజేత, పరిశ్రమల అధికారి సీతారాం,
తహసిల్దార్లు సునీల్ రెడ్డి, నాగరాజుకు బోజన ఏర్పాట్లు బాధ్యత పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. అధికారులు ఒకరోజు ముందుగానే శబరి గార్డెను చేరుకుని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వేసవిదృష్ట్యా
బస్సుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచడంతో పాటు శబరి గార్డెన్లో అత్యవసర చికిత్సా కేంద్రాన్ని
ఏర్పాటు చేసి మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. హైదరాబాదు వెళ్తున్న వారికి
గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. సకాలంలో సభాస్థలికి చేరుకునేందుకు రూటు మ్యాపును రూపొందించారని మ్యాపు ప్రకారం వాహనాలు పార్కింగ్కు నిర్దేశించిన స్థలంలో మాత్రమే నిలుపుదల చేయాలని చెప్పారు. కార్యక్రమం ముగిసిన తదుపరి మళ్లీ అందరిని కలుపుకొని క్షేమంగా కార్యస్థానాలకు చేరు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కార్యక్రమం విజయవంతం చేయడంలో అందరిపాత్ర ఉంటుందని సన్నద్ధంగా లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం
ఉందని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బంది ఏర్పాట్లు చేయాలని చెప్పారు. బస్సులు 13వ తేదీ రాత్రి 7.30
గంటలకే నియోజకవర్గ తహసిల్దార్ కార్యాలయంలో రిపోర్టు చేయు విధంగా చర్యలు చేపట్టాలని ఆర్టీసి అధికారులను
ఆదేశించారు. 14వ తేదీ ఉదయం హైదరాబాదు వెళ్లాల్సి ఉన్నందున ఉదయం 4 గంటలకు బయలు దేరే విధంగా
చర్యలు తీసుకోవాలని తహసిల్దారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా బయలు దేరుటకు వీలుగా మండల
కార్యస్థానంలో 13వ తేదీ రాత్రి బస చేయుటకు ఏర్పాట్లు చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. రవాణా సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షణ చేసేందుకు ప్రతి బస్సుకు ఇద్దరు లైజన్ అధికారులను కేటాయించినట్లు చెప్పారు. నిర్దేశించిన సమయం కంటే ముందుగా చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున జాప్యం చేయక సత్వరమే బయలుదేరు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సన్నద్ధత ఏర్పాట్లుపై
తహసిల్దారులను, ఆర్ సి అధికారులను అడిగి తెలుసుకుని చేయాల్సిన ఏర్పాట్లుపై దిశానిర్ధేశం చేశారు. మండలాలకు
బస్సులు, డ్రైవర్లు కేటాయింపు ప్రక్రియను ఆర్టీసి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఓ రమాకాంత్, జడ్పి సిఈఓ విద్యాలత, ఉపాధికల్పన
అధికారి విజేత, పరిశ్రమల శాఖ జియం సీతారం, డిఆర్డీఓ అశోకచక్రవర్తి, ఆర్టీసి డియం భవాని ప్రసాద్, కొత్తగూడెం,
భద్రాచలం ఆర్డీఓలు స్వర్ణలత, రత్నకళ్యాణి, అన్ని మండలాల తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు
పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking