రాత్రుళ్ళు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాలపడుతున్న ఇద్దరు దొంగలను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

రాత్రుళ్ళు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాలపడుతున్న ఇద్దరు దొంగలను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
రాత్రుళ్ళు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాలపడుతున్న ఇద్దరు దొంగలను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్‌పల్లి ఏసిపి చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. మెదక్ కౌడిపల్లికి చెందిన శ్యాం కుమార్ (19) కూకట్‌పల్లిలోని బాలకృష్ణ నగర్ లోని గుడిసెలలో నివసిస్తూ ఉంటాడు. చెడు వ్యసనాలకు బానిసైన శ్యాం, సులభంగా డబ్బులు సంపాదించటం కొరకు చోరీల బాటపట్టాడు. 2022లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరికి పాల్పడి పోలీసుల చేతికి చిక్కి జైలుకు వెళ్ళి మూడు నెలల క్రితం విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చినప్పటి, పద్దతి మార్చుకోకుండా తన చిన్న నాటి స్నేహితుడు మధుకుమార్(20)తో కలిసి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. చోరి సొత్తును విక్రయించటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ రోజు పోలీసుల చేతికి చిక్కారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచరించటంతో తాము చేసిన చోరీలు వివరాలు తెలపటంతో, వారి వద్ద నుండి 7 తులాల బంగారు ఆభరణాలు, ఒక కేజీ వెండి ఆభరణాలు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిని కోర్టులో హాజరుపరుచనున్నామని ఏసిపి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking