మహాత్మ జ్యోతిబా పూలే అణ గారిన వర్గాల అభ్యున్నతి కో సం కృషిచేసిన గొప్ప సంఘసం స్కర్త ◆ జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి – పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహాత్మ జ్యోతిబా పూలే అణ గారిన వర్గాల అభ్యున్నతి కో సం కృషిచేసిన గొప్ప సంఘసం స్కర్త
◆ జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
– పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

సిద్దిపేట,అక్షిత ప్రతినిధి :

జ్యోతిబా పూలే 197 వ జ యంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో
మహత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా కమిషనర్ మాట్లాడు తూ మహాత్మ జ్యోతిబా పూలే
బడుగు,బలహీన వర్గాల అ భ్యున్నతికి పాటుపడిన దీన జన బాంధవుడు అని,సమస మాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్పూర్తి ప్రధాతగా నిలిచి న మహాత్మ జ్యోతిబా పూలే ఎందరికో ఆదర్శం అని తెలి పారు.అణచివేతలకు వివక్షత లకు గురయిన బడుగు, బల హీన వర్గాలలో ఆత్మసైర్యం క ల్పించి,వారి హక్కుల కోసం పోరాడి,సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు,అణ గారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి సల్పడా నికి సత్యశోధక్ సమాజ్ స్థాపిం చి ,ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేసిన మహాను భావుడు జ్యోతిబా పూలే, నవతరానికి ఆదర్శప్రాయుడని వారి ఆశయ సాధనకు ప్రతిఒ క్కరూ కృషి చేయాలని,దేశం గర్వించే గొప్ప మహానీయుల్లో పూలే ఒకరన్నారు.

అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని గుర్తు చేశారు.సమా జంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమా జం అభివృద్ధి చెందదని భావిం చిన ఫూలే ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.1948 లో బాలికల కొరకు పాఠశాలను స్థాపించి,ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడమే కాకుండా తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే జీవిత చరిత్ర రానున్న భావితరాలకు ఆదర్శప్రాయమని కొనియా డారు.ఈ కార్యక్రమంలో అడిష నల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేం దర్,సిద్దిపేట ఏసీపి దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి ఫణీందర్,ఎస్బి ఎసిపి రవీందర్ రాజు,ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి,వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిక్షపతి,టూటౌ న్ ఇన్స్పెక్టర్ రవికుమార్,3 టౌన్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్, దుబ్బాక సీఐ కృష్ణ,సిద్దిపేట రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, కమిషనర్ కార్యాలయ సిబ్బంది సిద్దిపేట డివిజన్ ఎస్ఐలు పుష్పగుచ్చాలు వేసి నివాళు లర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking