ప్రయాణికులకు ఆర్టీసి బస్ స్టేషన్ లో చల్లటి నీటి సౌకర్యం

ప్రయాణికులకు ఆర్టీసి బస్ స్టేషన్ లో చల్లటి నీటి సౌకర్యం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ ఆర్టీసి బస్సు స్టేషన్ ఆవరణలో నిత్యం వందలాది ప్రయాణికులు బస్సులలో ప్రయాణించు నిమిత్తం, బస్టాండ్ ఆవరణకు వచ్చే ప్రయాణికులకు నిత్యము త్రాగునీరు అందించే సౌకర్యం ఉన్నప్పటికీ, ఈ వేసవి ఎండ తీవ్రత తో బాధపడుతూ దాహం తీర్చుకొను నిమిత్తం చల్లటి త్రాగునీరు కొనుక్కొని త్రాగే స్తోమత లేని వారికి సైతము, త్రాగునీరు అందించేందుకు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జిలాని, డిప్యూటీ ఆర్ఎం శివ కుమార్, డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ చల్లటి పరిశుభ్రమైన త్రాగునీరు కేంద్రాన్ని ప్రారంభించారు. అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రయాణికుడు వినియోగించుకుని ఎండ తీవ్రత నుండి కాపాడుకోగలరని కోరారు. కార్యక్రమంలో డిపో సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking