మహిళలకు విద్య అవసరం అని చాటిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవురావు

మహిళలకు విద్య అవసరం అని చాటిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే
జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవురావు

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

మహిళలకు విద్య అవసరం అని చాటిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలను సాధించే దిశగా కృషి చేయాలని

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవురావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు విద్యను అందించేందుకు అహర్నిశలు శ్రమించిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే సామాజిక కార్యకర్త, మేధావి, కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం, వారిలో ఆత్మ స్థైర్యం కల్పించి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేశారని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి భారత దేశంలో మహిళలకు విద్యను అందించేందుకు పాఠశాలలను ప్రారంభించి విద్యను సమాన హక్కుగా మహిళలకు అందించేందుకు కృషి చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లాను విద్యారంగంలో ముందంజలో ఉంచే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రాజేశ్వర్, జెడ్ పి టి సి అరిగెల నాగేశ్వరరావు, ఎం పి పి అరిగెల మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాధవేని మల్లేష్, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు రుద్రనార్ రమేష్, మారుతి, మాలి సంఘం నాయకులు అదే బాపురావు, గుర్నులే, మెంగాజి, గుర్నులే మారుతి, వివిధ కుల సంఘాల నాయకులు రేగుంట కేశవరావు, రజి హైదర్, వసతి గృహాల వార్డెన్, మాలి సంఘం ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking