టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
పినపాక అక్షిత ప్రతినిధి:
టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లను అందజేసినట్లు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దుర్గా భవాని తెలియజేశారు. మంగళవారం పినపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు పార్థసారథరెడ్డి ఆధ్వర్యంలో సరఫరా చేసిన న్యూట్రిషన్ కిట్టు లను వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీబీ వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ దుర్గా భవాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు