మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకొని రక్తదానం

మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకొని రక్తదానం

మంచిర్యాల, అక్షిత బ్యూరో):-

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జనని బ్లడ్ బ్యాంకులో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బడుగు వర్గాల అణచివేతను వ్యతిరేకిస్తూ, 200 సంవత్సరాల క్రితమే జ్యోతిబాపూలే కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన, సమ సమాజ నిర్మాణానికు పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు. మూఢనమ్మకాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి అని, తమ జీవితాలను సమాజానికే అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జ్యోతిబాపూలే కు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని కోరారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు యువత ముందుండాలని కోరారు. రక్తదానం చేసిన వారిలో బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్, నస్పూరి అఖిల్, ఆరే వెంకటస్వామి, ఇన్నారం కిరణ్, తదితరులు కలరు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ సంఘం లక్ష్మణ్, వడ్డేపల్లి మనోహర్, రాసమల్ల కుమార్, సమ్ము రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking