సర్వతో ముఖాభివృద్ధి బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
పినపాక అక్షిత ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం ,రాళ్ల వాగు వద్ద పినపాక మండలం బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గంలో జరిగిన మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మొదటి విడత 12 గ్రామపంచాయతీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరవడం జరిగింది. రాళ్ల వాగు వద్ద గల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళాకారుల ఆటపాటలు కార్యకర్తలతో నూతనత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని, పార్టీ అనుబంధ గ్రామ కమిటీలు పటిష్టతకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో 12 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.1,00,116 ఆర్థిక సాయం చేసి పేదలను ఆదుకున్నామన్నారు, 66 లక్షల రైతు కుటుంబాలకు రూ.17 వేల కోట్లను రైతుబంధు ద్వారా వారి అకౌంట్లో జమ చేశామని గుర్తు చేశారు, కార్యకర్తలు పార్టీకి పట్టు కొమ్మలని గ్రామాలలో సైనికుల వలె పనిచేయాలని అన్నారు.9 ఏండ్ల పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు.

పేదల అభ్యున్నత కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు. సొంత స్థలం ఉన్న వారికి త్వరలోనే ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇస్తుందని, నియోజకవర్గానికి 3,000 ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేయనుంది అన్నారు.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు, బిజెపి పాలిత రాష్ట్రాలలో కంటే తెలంగాణ అన్ని రంగాలలో ముందు వరుసలో నిలుస్తుందని సాగు రంగానికి లక్షల కోట్లు ఖర్చుపెట్టి రైతన్నకి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో దేశ ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే తనను సంప్రదించాలని సంప్రదించాలని, కార్యకర్తలు నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమేనని, అందుకే యావత్ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.మూడోసారి ముచ్చటగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక మండలం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అభిమానులు, యువజన నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.