బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం -ఇద్దరు మృతి పది మందికి గాయాలు -ముగ్గురు పోలీసులు ఇద్దరు జర్నలిస్ట్ లకు తీవ్ర గాయాలు

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం

-ఇద్దరు మృతి పది మందికి గాయాలు

-ముగ్గురు పోలీసులు ఇద్దరు జర్నలిస్ట్ లకు తీవ్ర గాయాలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటుచేసుకుంది.వైరా నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ ఇతర నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ నేతలు జనావాసాల మధ్య బాణాసంచాలు పేల్చారు.ఈ క్రమంలో తారాజువ్వలు పడటంతో సమీపంలోని గుడిసెకు నిప్పు అంటుకుంది.

గుడిసెలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటికి ఇద్దరు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలవ్వగా క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.గాయపడ్డవారిలో ముగ్గురు పోలీసులు ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు కాళ్లు పూర్తిగా కోల్పోయినట్లు తెలుస్తుంది.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking