ఈనెల 14న జరిగే భారీ బహిరంగ సభ భారీగా తరలి రావాలి -పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు
ఈనెల 14న జరిగే భారీ బహిరంగ సభ భారీగా తరలి రావాలి
-పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఈ నెల 14 న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నేలకొండపల్లి మండల పాలేరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గోనాలని పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు పిలుపునిచ్చారు.నిన్న కార్యలయంలో మీడీయా సమావేశంలో మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ పై బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అక్రమ కేసులు నమోదు చేసి ఆ కేసులపై రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసి ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసి ఒక్కరోజు లోనే ఇంటిని సైతం ఖాళీ చేయించి ఒక భారీ కుట్రకు తెరలేపారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని రాహుల్ గాంధీకి మద్దతుగా ఉండాలన్న లక్ష్యంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.రాహుల్ గాంధీకి అండగా ఉందాం.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందమని పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు కోరారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని సభ్యత్వాల మండల ఇంచార్జీ రేగురి హనుమంతరావు మండల నాయకులు దోసపాటీ శేఖర్ జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణు ఎస్సీ సెల్ నాయకులు సూరేపల్లి రవి నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు యాతాకుల శ్రీనాధ్ పగిడిమర్రి అజయ్ ధనవత్ సంతోష్ భూక్యా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.