లద్నూర్ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని ధర్నా

లద్నూర్ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని ధర్నా

మద్దూరు అక్షిత న్యూస్:

మండలంలోని లద్దునూర్ సర్పంచ్ జీడికంటి సుదర్శన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికీ చెందిన గౌడ సంఘం నాయకులు తాడురి రామచంద్రం,బొడుగం సిద్దిరాములు, కూరెళ్ల నర్సిహ్మలు, కూరెల్ల మల్లేశం, కూరెళ్ల ఉప్పలయ్య, బొంగోని బుచ్చయ్యలు గ్రామానికీ చెందిన అనంత రామారావు, పసునూరి వెంకటేశ్వర రావులకు సంబందించిన భూమి సర్వే నంబర్ 448,449,549,లలోని ఏ 8.32 గుంటల భూమిని లద్నూర్ గ్రామానికి చెందిన గులాం సందాని మధ్యవర్థిగా యుండి విక్రయింప జుపగా మేము మూకుమ్మడిగా కొనుగోలు చేసి 1998లో రిజిష్టర్ చేసుకొంటేమి నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ ద్వార జరిగే లావాదేవీలు పొందుతున్నాము. అట్టి భూమిలో కాస్తులో ఉండి కబ్జాలో ఉండి జీవనం సాగిస్తున్నాము. ఈ నేపధ్యంలో సర్పంచ్ జీడికంటి సుదర్శన్, తన చిన్నయన యగు జిడికంటి రామచంద్రం అక్రమంగా అర్ ఓ అర్ లో 448లో ఒక ఎకరం భూమి ఎక్కించుకున్నాడు.ఈ విషయమై సర్పంచ్ రామచంద్రంను పురమాయించి తాము కొనుగోలు చేసిన భూమి నుండి ఒక ఎకరం భూమి వస్తదని చెప్పి రాత్రికి రాత్రే మేము సాగు చేసుకొంటున్న భూమిలోకి చొరబడి దున్నకాలు చేపట్టగా మేము అందరం కలిసి అడ్డుకున్నాం. ఈ విషయమై న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కువెళ్లడం జరిగిందన్నారు. నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో తలా రెండు లక్షల దడవతులు పెట్టుకొని పంచాయతీ కూర్చోవడం జరిగిందన్నారు. పంచాయతీలో ఎలాంటి తీర్పు ఇవ్వకుండానే జిడికంటి రామచంద్రంకు డబ్బులు వాపస్ ఇచ్చిన సర్పంచ్ మా దడవత్ డబ్బులు మాకు ఇవ్వకుండా ఆరు మాసాలుగా తన ఇంటి చుట్టూ తిప్పుకుంటూ ఎవరు ఏం చేసుకుంటారో చేసుకో అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కొనుగోలు చేసిన ఏ.8.32 కుంటల భూమికి మాకు అద్దులు పాటించి న్యాయం చేయాలని మద్దూరు మండల ప్రజా పరిషత్ అధికారి ఎంపిఓ ఖాజా మైనొద్దిన్ కు వినతీ పత్రం అందజేశారు.తక్షణమే సర్పంచ్ జిడికంటి సుదర్శన్ పై చర్యలు తీసుకోనీ మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక సర్పంచ్ సుదర్శన్ ను వివరణ కోరగా అవి అవాస్తమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking