పది రోజుల్లో వివాహం అంతలోనే యువతి ఆత్మహత్య కుటుంబ కలహాలే యువతి మరణానికి కారణం రేగుళ్ల గ్రామంలో విషాదం

పది రోజుల్లో వివాహం అంతలోనే యువతి ఆత్మహత్య

కుటుంబ కలహాలే యువతి మరణానికి కారణం

రేగుళ్ల గ్రామంలో విషాదం

పినపాక అక్షిత ప్రతినిధి:

పది రోజుల్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవలసిన యువతి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కరకగూడెం మండలం రేగుళ్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తుమ్మలగూడెం పంచాయతీ రేగుళ్ల గ్రామానికి జనగం మానస 20 అదే గ్రామానికి చెందిన చప్పిడి ప్రశాంత్ అనే యువకుడితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈనెల 22న ముహూర్తం ఖరారు చేశారు. సోమవారం మృతురాలి తండ్రి పుల్లయ్య అన్న చందు మధ్య చిన్న గొడవ జరిగి ఈ విషయంపై బుధవారం తండ్రి పుల్లయ్య కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. మంగళవారం రాత్రి అన్న పెళ్లి పత్రికలను కాలబెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురి చెందిన మానస క్రిమిసంహారక మందు తాగి కుటుంబ సభ్యులు కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్య సలహా మేరకు మణుగూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మానస తుది శ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న కరకగూడెం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మణుగూరు వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking