మూతబడిన నేలకొండపల్లి బస్టాండ్ ను పునః ప్రారంభించాలి -సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సంతకాల సేకరణకు మంచి స్పందన
మూతబడిన నేలకొండపల్లి బస్టాండ్ ను పునః ప్రారంభించాలి
-సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సంతకాల సేకరణకు మంచి స్పందన
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో మూతబడిన ఆర్టీసీ బస్టాండ్ ను పునః ప్రారంభించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది.తీవ్ర ఎండలో సైతం కార్యక్రమం నిర్వహించారు.అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సి వై పుల్లయ్య హాజరై మాట్లాడుతూ చాలా సంత్సరాల నుండి బస్టాండ్ మూతవేశారని అది లేక ప్రయాణికులు ఏండలకు వానలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లా మండల అధికారులు చర్యలను చేపట్టకుండా అలక్ష్యం వహిస్తున్నారని అన్నారు.జిల్లాలో పెద్ద మండలాలలో ఒకటిగా ఉన్న నేలకొండపల్లిలో బస్టాండ్ మరియు బస్ షెల్టర్ లు లేక ప్రయాణికులు విద్యార్థులు మండు టెండలలో వేచి ఉంటున్నారని తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని క్షత గాత్రులు అవుతున్నారని మృతి చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి జిల్లా కలెక్టర్ ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ ను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి
సివై పుల్లయ్య పార్టీ డివిజన్ నాయకులు పగిడికత్తుల రామదాసు పార్టీ మండల కార్యదర్శి చిర్రా భిక్షం పార్టీ మండల నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు వీరబాబు టీ అంబేద్కర్ ఎస్ రమేష్ భార్గవ్ పీ ఓ డబ్ల్యూ నాయకురాలు ఎస్ కె షకీలా లక్కం సైదమ్మ, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.