రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామీకం
దొంగరి గోవర్ధన్ మండల పార్టీ అధ్యక్షులు
తుంగతుర్తి, అక్షిత:
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం ఆప్రజాస్వామికమని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై రానున్న రోజుల్లో దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటు వ్యవస్థను, న్యాయవ్యవస్థను కేంద్ర ప్రభుత్వం పక్కతోవ పట్టిస్తూ భారతదేశానికి అపకీర్తి వచ్చేలా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశ సంపదను బిజెపి ప్రభుత్వం ఆదానికి దోచిపెట్టిన వైనాన్ని పార్లమెంటులో రాహుల్ గాంధీ దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేక ఒక చిన్న కేసును సాకుగా చూపి రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. దేశ ప్రజల నుండి అధికంగా పన్నులు వసూలు చేస్తూ… దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపడం ఖాయమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని టీఎస్పిఎస్సీ పేపర్ లీకేజీలపై చరణ్ చేపట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ అదేవిధంగా ఈనెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే చలో మంచిర్యాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దొంగరి గోవర్ధన్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, అన్నారం గ్రామ సర్పంచ్ మిట్టగడుపుల అనూక్, మండల జనరల్ సెక్రెటరీ దాయం సంజీవరెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తప్పేట్ల శంకర్, నాయకులు ఉప్పుల రాంబాబు, గంగయ్య, వెంకన్న, రాములు తదితరులు పాల్గొన్నారు.