మృతుడి కుటుంబానికి అండగా డిఎన్ఆర్
– మాజీ సర్పంచ్ వెంకటయ్య గౌడ్
ఊరుకొండ, అక్షిత ప్రతినిధి :
ఊర్కొండ మండల మృతుల కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉంటు, బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయుతనిస్తున్న మాధారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి అని మాజీ సర్పంచ్ వెంకటయ్య గౌడ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఇప్పపాడు గ్రామానికి చెందిన దుబ్బ ఎల్లమ్మ అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జననేత, పేదల పెన్నిధి, ద్యాప నిఖిల్ రెడ్డి కి తెలియజేసారు. తక్షణమే స్పందించిన నిఖిల్ రెడ్డి నిఖిలన్న యువసేన పేరిట 5000 రూపాయలు తక్షణ ఆర్ధిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ ద్యాప నిఖిలన్న మండలం లోని ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని, బాధితులు ఆత్మస్థైర్యంతో ఉంటూ మాకు ఆపద అంటే నిఖిల్ రెడ్డి సహాయం తప్పక వస్తుందని ధైర్యంగా ఉంటున్నారని తెలిపారు మండల ప్రజలను ఎల్లవేళలా ఆదుకుంటూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా, నేనున్నా అంటూ, తన సహాయ సహకారాలు అందిస్తున్న ద్యాప నిఖిల్ రెడ్డి గరిబోళ్ల గుండెల్లో గూడు కట్టుకున్నారని, నిరుపేద కుటుంబాలకు పెద్ద కొడుకు అయ్యారని తెలిపారు.
ఈ కార్యక్రమలో శ్రీనివాస్ గౌడ్ , దుబ్బ మల్లేష్, సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య ఉన్నారు