విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్ – ఏప్రిల్ 17 నుండి సమ్మె బాట పట్టనున్న  విద్యుత్ ఉద్యోగులు

విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్

– ఏప్రిల్ 17 నుండి సమ్మె బాట పట్టనున్న  విద్యుత్ ఉద్యోగులు

పినపాక అక్షిత ప్రతినిధి:

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు  ఆందోళనకు సిద్ధం అవుతున్నమని పిఆర్సి అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఏప్రిల్ 17వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు(1104 యూనియన్) తెలియజేశారు. గురువారం ఏడూళ్ల బయ్యారంలో గల విద్యుత్ సబ్స్టేషన్ లో కరకగూడెం మణుగూరు ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1999 మరియు 2004 మధ్య నియమించబడిన ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ ను జీపీఎఫ్  సదుపాయంగా మార్చడం, విద్యుత్తు వినియోగాల్లోని చేతివృత్తుల వారి డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగిందన్నారు.

గత ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ సంఘంపై యాజమాన్యం వైఖరి పట్ల ఉద్యోగులు నిరాశ చెందారని జేఏసీ నాయకులు తెలిపారు.

చివరగా, యాజమాన్యం , టీఎస్పీఈ జేఏసీ మధ్య చర్చలు విఫలమవడంతో ఏప్రిల్ 17 నుండి సమ్మె చేయాలని అత్యవసర సమావేశం నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసిన సమ్మెకు వెనక్కు తగ్గమని తెలియజేశారు.విద్యుత్ యాజమాన్యాలపై విశ్వాసంతో సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు ఓర్పుతో వ్యవహరించామని తెలిపారు. వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టినా మేనేజ్​మెంట్​నుంచి సరైన స్పందన లేకపోవడంతో అనివార్యంగా ఈ నెల 17 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించి నోటీసు అందజేశామని తెలిపారు. సమ్మె ను ఉద్యోగులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించే విద్యుత్ ఉద్యోగులు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జరిపే సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్, డీఈ జీవన్ కుమార్, కో చైర్మన్ బి రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ వెంకటరాజు(సీఐటీయూ), ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉదయ్ రత్న కుమార్, ఉద్యోగుల సంఘం బీసీ నాయకులు సీతారాములు, ఉద్యోగుల ఓసి అసోసియేషన్ నాయకురాలు, ఏడూళ్ల బయ్యారం ఏఈ కావ్య, విద్యుత్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking