తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ పక్కా
* ప్రజల్లో బిజెపి పట్ల పూర్తి విశ్వాసం
* బీజేపీ జాతీయమీడియా కోర్దినేటర్ ఓబీసీ కె.వి రంగాకిరణ్ జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు
* సుజాతనగర్ మండలంలో
ఇంటింటికి కరపత్రాలు పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, త్వరలో కెసిఆర్ నియంత ప్రభుత్వాన్ని అంతమొందించి డబుల్ ఇంజన్ సర్కర్ తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిజెపి మోర్చా జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఓబిసి కెవి రంగా కిరణ్ అన్నారు. బిజెపి జాతీయ పార్టీ పిలుపుమేరకు పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్నీ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సర్వరం గ్రామంలో నిర్వహించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షుడు భూక్య రాజేష నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీల అభివృద్ధి కొరకు అమలు చేస్తున్న పథకాలు నరేంద్రమోదీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ జాతీయమీడియా కోర్దినేటర్ ఈకార్యక్రమం జిల్లా కోర్దినేటర్ రంగాకిరణ్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం కె.వి రంగాకిరణ్ ఆకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ పాలన పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు.

రానున్న ఎన్నికల్లో బిజెపికి పట్టం కట్టడం ఖాయమన్నారు. ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓబీసీ జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈకార్యక్రమం ఈనెల 6 నుండి ప్రారంభమై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతినాటికి పూర్తి అవుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ నరేంద్రబాబు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెర్వు శ్రీనివాసరావు ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గంధం నాగేంద్ర ప్రసాద్ కోశాధికారి జల్లారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.