కాంగ్రెస్ పార్టీ బీసీ డిమాండ్లను అసెంబ్లీలో ప్రస్తావించాలి మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కు వినతి
కాంగ్రెస్ పార్టీ బీసీ డిమాండ్లను అసెంబ్లీలో ప్రస్తావించాలి
మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కు వినతి
మంచిర్యాల, అక్షిత బ్యూరో:
కాంగ్రెస్ పార్టీ బీసీ డిమాండ్లను అసెంబ్లీలో ప్రస్తావించాలని బిసి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 56 శాతం పెంచి వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నియమించాలని, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ, చట్టం చేయాలని, బీసీ ఫెడరేషన్లకు పాలకమండల్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని, 50వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, అత్యాచార నిరోధక చట్టాన్ని బీసీలకు సైతం వర్తింప చేయాలని, రాష్ట్ర ప్రభుత్వమే బీసీ జనగణన చేపట్టాలని, పారిశ్రామిక రంగంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని పలు డిమాండ్లను అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తావించాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్, కో కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, నస్పూరి అఖిల్, జంబోయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.