డి.ఎస్.పి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

మంచిర్యాల, అక్షిత బ్యూరో: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీచౌరస్తాలో డి.ఎస్.పి (దళిత శక్తి ప్రోగ్రాం) ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డి.ఎస్.పి (దళిత శక్తి ప్రోగ్రాం) జిల్లా కన్వీనర్ నందిపాటి రాజు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న, దేశంలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉన్నారని అన్నారు. దేశ జనాభాలో 10 శాతం ఉన్న అగ్రకులాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 75 సంవత్సరాలుగా పాలిస్తున్నారని, ఈ దేశ జనాభాలో 90 శాతం ఉన్న అణగారిన కులాలు పార్లమెంటులో, అసెంబ్లీలో జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారంలో వాటా లేకపోవడం అంటే ఈ వర్గాలను వివక్షకు గురి చేయడమే అవుతుందని, నిమ్న వర్గాలు ఎప్పుడైతే రాజ్యాధికారం సాధిస్తాయో అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళులర్పించిన వాళ్ళం అవుతామని, అప్పుడే భారత రాజ్యాంగం పూర్తిగా అమలైనట్లు భావించాలని తెలిపారు. అసెంబ్లీకి. పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టి విగ్రహాలు పెట్టినంత మాత్రాన ఆయన ఆశలు నెరవేరినట్లు కాదని, ఇది కేవలం అగ్రకులాలు ఓటు బ్యాంకు కోసం చేస్తున్నటువంటి ఆర్భాటం మాత్రమేనని, ఎప్పుడైతే భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు అవుతుందో ఇప్పుడే అంబేద్కర్ నిజమైన నివాళులర్పించిన వాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీ.ఎస్.పి జిల్లా నాయకులు జంగాపల్లి రామస్వామి, రేగుంట రాజేష్, తాళ్లపల్లి చంద్రశేఖర్, జనం పెళ్లి వెంకటేష్, బీసీ జాగృతి పట్టణ అధ్యక్షులు వైద్య భాస్కర్, ఉపాధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మణ్, సంతోష్, సుదర్శన్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking