మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: మిర్యాలగూడ మండలంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు పొదిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి నిర్వహిస్తున్న రెండో విడత హాత్ సే హాత్ జోడో యాత్ర శుక్రవారం దొండవారిగూడెం గ్రామం నుంచి జేత్యతండా, సామ్యతండాల మీదగా తకెళ్లపాడ్ తండాకు చేరుకుంది. యాత్రలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీ లు , జడ్పీటీసీ లు, కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.