అంబేడ్కర్ అందరివాడు ఘనంగా బిఎస్ పి ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి

అంబేడ్కర్ అందరివాడు

ఘనంగా బిఎస్ పి ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి

అక్షిత ప్రతినిధి: వేములపల్లి: భారతరాజ్యాంగ నిర్మాత సమ సమాజ స్థాపకుడు 100 కోట్ల ఆరాధ్య దైవం డాక్టర్ బి.ఆర్ అని బిఎస్ పి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పుట్టల దినేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హరిజన వాడలో నిర్వహించిన అంబేద్కర్ 132 వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీసీలు కులవృత్తులు మాత్రమే చేసుకొని బ్రతకాలిసంపన్న వర్గాలు మాత్రం ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ, విదేశాల్లో ఉంటూ, సూటూ బూటూ వేసుకొని, కార్లలో, విమానాల్లో తిరుగుతున్నారంటే అది ఎవరు పెట్టిన భిక్షో మరొకసారి చెప్పనా అది డా.బీఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని అన్నారు. ఇది మరచిపోయి, బీసీలను కులవృత్తికి పరిమితం చేసి, బానిసను చేసి, చదువుకు దూరం చేసి, అణగదొక్కిన మనువాదుల వెంట తిరుగుతూ మనువాదుల కాళ్ళు పట్టుకుంటూ, రాజ్యాంగాన్ని మరచిపోయి, రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసి బతుకుతున్నావంటే కాలం క్షమిస్తుందాఅని ప్రశ్నించారు.బీసీలను మళ్ళీ నేత నేసి , గొర్రెలు కాసి, కల్లు గీసుకొని, క్షవరం చెప్పులు కుట్టి మాత్రమే బ్రతకమంటాయి ఈ ప్రభుత్వాలు అని అన్నారు. దేశంలో మేనిఫెస్టో లేకుండా భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మిర్యాలగూడ టౌన్ అధ్యక్షులు గాలీబ్ దైద బన్నీ మాతంగి ఏసు, దైద అఖిల్, చరణ్ సన్నీ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking