రాజనీతి దార్శనికుడు బాబాసాహెబ్​ అంబేద్కర్ ఆర్కే5బీ గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్

రాజనీతి దార్శనికుడు బాబాసాహెబ్​ అంబేద్కర్

ఆర్కే5బీ గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్

మంచిర్యాల, అక్షిత బ్యూరో:-

రాజనీతి దర్శకనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆర్కె 5బీ గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. శుక్రవారం గని ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
బాబాసాహెబ్​ అంబేద్కర్ భారతదేశపు సిసలైన రాజనీతిజ్ఞుడని, భరత జాతి మెదస్సును ప్రపంచానికి పరిచయం చేసిన సంపన్నుడన్నారు. అంబేద్కర్ ప్రపంచ మానవీయ రాజకీయాలను ప్రభావితం చేసిన మహనీయుడని, నిమ్నవర్గాల్లో జన్మించినా తన ఆలోచనా విధానంలో అత్యున్నత గుణాలు కలిగిన నిజాయితీ, నిబద్ధతతో ఆణిముత్యం అయ్యారన్నారు.
అసమానత్వంతో నిర్మితమైన భారత దేశ ఏర్పాటును సమానత్వం వైపు తీసుకెళ్లే మార్గాలను తన పుస్తకాల్లో సూచించారన్నారు.
కుల, మత, ప్రాంత వైరుధ్యాలతో పాటు భాషా వైవిధ్యాలతో ఏర్పాటైన దేశానికి రాజ్యాంగం రాయడం అనేది అంత సులభమైన అంశం కాదని, భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదానికి ప్రతిరూపంగా రాజ్యాంగ రచన చేశారని, అంబేద్కర్​ పుట్టుక సమానత్వానికి ప్రతీక అయిందన్నారు. పూలే ఆశయమైన సామాజిక న్యాయాన్ని తన కార్యాచరణగా మార్చుకొని దేశ, విదేశాల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమించిన ధీరుడు అని అన్నారు. బ్రిటన్​, అమెరికాల్లో చదివిన అనుభవంతో ప్రపంచస్థాయి ఆలోచనలను భారతదేశానికి అందించిన మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గని అసిస్టెంట్ మేనేజర్ రామచందర్, రక్షణ అధికారి శివయ్య, వెల్ఫేర్ ఆఫీసర్ రణధీర్ గౌడ్, ఇంజనీర్లు సందీప్, వీరన్న, సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ సింగరేణి ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కుమార్, ఫిట్ సెక్రటరీలు మహేందర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking