*ప్రపంచ మేధావి అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు

*ప్రపంచ మేధావి అంబేద్కర్
132వ జయంతి వేడుకలు

మేడ్చల్, అక్షిత బ్యూరో :

ప్రపంచ మేధావి అంబేద్కర్ స్ఫూర్తిగా ప్రతిఒక్కరు అనగారిన వర్గాలకోసం, ఈ దేశం కోసం పాటు పడాలని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి తిప్పారాపు లక్ష్మణ్ మాదిగ కోరారు.మల్కాజిగిరి ఆనంద్ భాగ్ చౌరస్తా లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 132వ జయంతి వేడుకలను నిర్వహించారు.ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ విజయ్ రావు మాదిగ, జర్నలిస్ట్ నాయకులు మనోహర్, బీసీ నాయకులు రామగిరి ప్రకాష్, వీహెచ్పీఎస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు వినయ్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందే నాదేశం, దేశ ప్రజలు బాగుండాలనే దీర్ఘ కాలిక ప్రయోజనాలతో రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.

అందరికి సమాన హక్కులు, అవకాశలకోసం అనునిత్యం పాటు పడిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేద్కర్ మేదాశక్తిని ప్రపంచ దేశాలు గుర్తించి ఆయన సూచనలను పాటిస్తూ ఆలోచనలను అనుసరిస్తున్నాయని తెలిపారు… జాతిని మేల్కొల్పిన మహనీయుని స్ఫూర్తిగా దేశంలో మన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking