అంబేద్కర్ సేవలు మరువలేనివి * డైరెక్టర్ పి అండ్ పి జి.వెంకటేశ్వర్ రెడ్డి * సింగరేణి హెడ్ ఆఫీస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ సేవలు మరువలేనివి
* డైరెక్టర్ పి అండ్ పి జి.వెంకటేశ్వర్ రెడ్డి
* సింగరేణి హెడ్ ఆఫీస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
సింగరేణి కాలరీస్ కార్పొరేట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలను సింగరేణి హెడ్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంస్థ డైరెక్టర్ పి అండ్ పి జి.వెంకటేశ్వర రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం కేక్ కట్ చేసి సింగరేణియులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా జి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలను అవరోధాలను అధిగమించారని తెలిపారు. అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడు దేశ సమైఖ్యతను ఆకాంక్షించిన మహనీయుడని కొనియాడారు.

ఆయన జయంతిని “నాలెడ్జ్ డే” గా జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు. అందరూ బాగా చదువుకోవాలని తద్వారా సంస్కారం సమానత్వం మానవ హక్కులు విజ్ఞత తెలుస్తుందని వివరించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సూచించారు. నేటి తరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేదస్సును, విలువలు బోధించాలని అన్నారు. అదే విధంగా మన సిఎండి ఎన్ శ్రీధర్ మార్గనిర్దేశంలో మన సంస్ధలో కూడా ఎస్‌సి,ఎస్‌టి, బిసి లను ప్రోత్సహించడంలో గాని ఎక్కడా కూడా వివక్ష లేకుండా రాజ్యాంగబద్దంగా నడుచుకుంటుందని, జిఓ నెం.34, జిఓ. నెం. 59, రిసర్వేషన్ ఆర్‌ఓఆర్ అమలు చేస్తున్నామని, సంస్ధ లోని ఎస్‌సి,ఎస్‌టి, బిసి లు సంస్ధ అభివృద్ది కొరకు పాటుపడాలని కోరారు. అంబేడ్కర్ జీవిత విశేషాలను ఆయన దేశానికి అందించిన సేవలను ఈ తరం విద్యార్ధుల యందు అవగాహన కల్గించించడానికి నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. అలాగే హెడ్ ఆఫీస్ లో పని చేసే అసంఘటిత కార్మికులకు చీరలను పంచడం జరిగింది. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్‌సి
కె.బసవయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేట్ జిఎంలు దామోదర్ రావు, సిఎంఓ బిహెచ్. వేంకటేశ్వర రావు, శెశిధరరాజు, లైసన్ ఆఫీసర్లు వి.కృష్ణయ్య, మాల కొండయ్య, ఎస్‌సి ఎస్‌టి సంక్షేమ సంఘం నాయకులు అంతోటి నాగేశ్వరరావు, బి.నాగేశ్వరరావు, కర్ణ, ఓదెలు, టిబిజికేఎస్ ప్రతినిధి పి.శంకర్, సిఎంఓఏఐ కార్పొరేట్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, డిజిఎం పర్సనల్ కె.శ్రీనివాసరావు, సివిల్, పర్సనల్, ఈ అండ్ ఎం ఇతర అధికారులు ఎస్‌సిఎస్‌టి సంఘ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.