ఖమ్మంలో జోరుగా టీడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు

ఖమ్మంలో జోరుగా టీడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరంలోని 17 వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వడ్డేం విజయ్ ఆధ్వర్యంలో డివిజన్ కోఆర్డినేటర్ తలపనేని జయరాం అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంట్ అబ్జర్వర్ కూరపాటి వెంకటేశ్వర్లు హాజరై డివిజన్లోని ఇంటింటికి తిరుగుతూ మహిళలతో బొట్టు పెట్టించి కరపత్రాలు పంచుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద ప్రజలందరికీ మంచి సువర్ణ అవకాశం కల్పించిందన్నారు.మహిళలకు ఆస్థి లో సమాన అవకాశాలు కల్పించి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువలో చేసిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు.తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందంటె టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంస్కరణల వల్లనే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.అనంతరం ఇటీవల ఆస్ట్రేలియాలో మరణించిన ఏపూరి హర్షవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో గుత్తా సీతయ్య ప్యారిస్ వెంకన్న గుండ పిన్ని నాగేశ్వరావు కంది బండ నరసింహారావు ఓర్స్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking