ఉద్యోగం ఏదైనా నైపుణ్యం అవసరం
-జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలోని విట్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వేదికగా తెలంగాణా గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ అధ్వర్యంలో కంప్యూటర్ విద్య పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధి కల్పనా అధికారి కొండపల్లి శ్రీరామ్ పాల్గొని ప్రసంగించారు.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా శ్రీరామ్ మాట్లాడుతూ భవిష్యత్తు లో కంప్యూటర్ విద్య చాలా అవసరమని రానున్న రోజుల్లో అన్ని పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఉండే అవకాశం ఉందని ఇప్పటికే దేశం డిజిటల్ ఇండియాగా మారుతుందని కంప్యూటర్ రంగంలో యువత ముందుండాలి అని తెలియచేసారు. ఉద్యోగం చిన్నదైన పెద్దదైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో నైపుణ్యత లేనిదే రాణించలేరని గుర్తుచేశారు. అనంతరం తెలంగాణ గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ విట్స్ సంయుక్త అధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన వారికి దృవపత్రాలు అందించారు. శిక్షణ పూర్తి చేసుకుని వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణా గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ చైర్మన్ కోడిరెక్క ఉమా శంకర్ వైస్ చైర్మన్ లింగనబోయిన సతీష్ సభ్యులు సారిక ఉపేందర్ గోగుల చంద్రశేఖర్ అధ్యాపకులు తబస్సుం విద్యార్దులు పాల్గొన్నారు.