చిట్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.
చిట్యాల అక్షిత ప్రతినిధి: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైతుల నుండి ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ సుంకరి మల్లేష్, వైస్ చైర్మన్ మెండే సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి , వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ జగిని బిక్షం రెడ్డి, కౌన్సిలర్స్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా వెంకటేశ్వర్లు, శిలువేరు శేఖర్, జయారపు శివ,పొన్నం లక్ష్మయ్య,చిత్రగంటి ప్రవీణ్ మొదలగు వారు పాల్గొన్నారు.