బాటసారుల దాహార్తి
తీర్చేందుకు చలివేంద్రాలు
ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ప్రతి ఏడాది వేసవిలో మండు టెండల్లో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. మిర్యాలగూడ పట్టణంలో జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో తమ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, శనివారం పోటు సుధీర్ సంస్మరణార్థం ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా, బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాలను శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు సోదరులు నల్లమోతు సాంబశివరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాటసారులకు చలివేంద్రాల వద్ద స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సాంబశివరావు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జావీద్, మొహమ్మద్ ఇలియాస్, యర్రమల్ల దినేష్, పునాటి లక్ష్మీనారాయణ, ఐల వెంకన్న, ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, ఆయిల్ శ్రీను, తిరంశెట్టి కోటేశ్వర్ రావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఖాజా, గాదగొని మహేష్, రహమాన్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.