ఆత్మీయ సమ్మేళనం లో మున్నూరు కాపులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. కాపు కులస్తులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే బొల్లం. మున్నూరు కాపు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు చందు నాగేశ్వరరావు.

ఆత్మీయ సమ్మేళనం లో మున్నూరు కాపులు అధిక సంఖ్యలో పాల్గొనాలి.

కాపు కులస్తులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే బొల్లం.

మున్నూరు కాపు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు చందు నాగేశ్వరరావు.

కోదాడ టౌన్ అక్షిత న్యూస్:

కోదాడ పట్టణంలో రేపు జరగబోయే బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మున్నూరు కాపు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు చందు నాగేశ్వరరావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావుతో కలిసి  ఆయన  మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కులస్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి రాష్ట్రస్థాయిలో పెద్దపేట వేశారని  అదేవిధంగా కోదాడ నియోజకవర్గం లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికిసర్పంచులుగా,ఎంపీటీసీలుగా, పిఎసిఎస్ చైర్మన్ లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా పార్టీలో కీలక పదవులు ఇచ్చి అవకాశం కల్పించి  కాపు కులస్తులను గౌరవించారని అన్నారు.

కాపు కులస్తులంతా బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి అండగా ఉండాలన్నారు. రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి పద్మజ, ప్రముఖ న్యాయవాది పాలేటి నాగేశ్వరరావు, మున్నూరు కాపు సంఘం మండల కన్వీనర్ పొట్ట జగన్మోహన్ రావు, దేవాలయ చైర్మన్ కామిశెట్టి నరసింహారావు, పొట్ట కిరణ్, పసుపులేటి నరసింహారావు, బాబు,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking