కంటి చూపు లేకపోతే లోకమంతా అంధకారం…. డాక్టర్ శ్రీనివాస్ తాటిపల్లి
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ శంకర నేత్రాల కంటి హాస్పిటల్ వారు సౌత్ ఇండియా , సెంట్రల్ ఇండియాలోనే మొట్టమొదటి సారిగా ఆల్కాన్ ఆర్గోస్ ను లాంచ్ చేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యాధునికమైన సాంకేతికతను కలిగిన పరికరాలతో కంటి పరీక్ష చేసి రోగ నిర్ధారణ గావించి వాటికి సరైన చికిత్స చేయడానికి నూతన ఒరవడికి
శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా శుక్రవారం మియాపూర్ లోని శ్రీ శంకర నేత్రాలయ కంటి హాస్పిటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్గోస్ టెక్నాలజీ కాట్రాక్ట్ చిత్ర చికిత్స యంత్రాన్ని డాక్టర్ శ్రీనివాస్ ఆసుపత్రి డాక్టర్ల బృందం చే నూతన ప్రారంభోత్సవం చేశారు, అనంతరం డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్గోస్ టెక్నాలజీ ద్వారా కంటి శుక్లమ్ రోగులకు వేగంగా స్కానింగ్ చేయగలరని ఈ సరికొత్త టెక్నాలజీతో స్కానింగ్ చాలా సమర్థవంతంగా మరియు అత్యధిక ఖచ్చితత్వంతో చేయగలదని తెలిపారు, ఆర్ గోస్ట్ టెక్నాలజీ తో స్కానింగ్ స్పీడ్ టెన్ సెకండ్స్ కన్నా తక్కువలో చేయబడుతుందని అర్గోస్ సాంకేతికతతో ముదిరిపోయిన మరియు దుడమైన దట్టమైన శుక్లమున్న రోగుల్లో కూడా రోగి కన్నును తాకకుండా నాన్ టచ్ స్కానింగ్ చేయగలరని తెలిపారు, చిన్నపిల్లల కంటిచూపులల్లో కూడా ఖచ్చితత్వంతో సమర్థవంతంగా స్కానింగ్ చేయగలరని అన్ని రకాల శుక్లాల్లో కచ్చితంగా కంటిలో ఆమ్లా అద్దం ఐఓఎల్ పవర్ లెక్కించగలరని తెలిపారు, ఇప్పటివరకు శ్రీ శంకర నేత్రాలయం ద్వారా 3 లక్షల మంది పేషెంట్లకు సమర్థవంతంగా చికిత్సను అందించామని నేర్పరులైన వైద్య బృందం చే సమన్వయంతో శుక్లాల ఆపరేషన్ చేయడం మరియు మంచి ఫలితాలను ఆపరేషన్ తర్వాత కూడా అందించడంలో భాగంగా చాలా కృషితో ఆధునిక టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నామని డాక్టర్ శ్రీనివాస్ తాటిపల్లి ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీ శంకర నేత్రాలయం కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆసుపత్రి సిబ్బంది కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.