రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. బిఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో నిరాశ. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పారా సీతయ్య

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.

బిఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో నిరాశ.

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పారా సీతయ్య

కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:

బిఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుకు చెంది తీవ్ర నిరాశలో ఉన్నారని ముఖ్యఅతిథి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక 29వ వార్డులో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గడప,గడపకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజలందరికీ వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాల, మతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వాల కనులు తెరిపించేందుకు దేశ ప్రజలందరినీ ఐక్యం చేసేందుకు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేశారని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో పరిపాలన పట్ల ప్రజలు విసుగు చెంది తీవ్ర నిరాశలో ఉన్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలోడిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, వంటి పులి వెంకటేష్, గరినే శ్రీధర్, పాలూరి సత్యనారాయణ, బాల్ రెడ్డి, గంధం యాదగిరి, వెంకట్రావు ,పిడతల శ్రీను, బాగ్దాద్, ఖాజా గౌడ్, శ్రీనివాస్, బాజన్,రజనీకాంత్,యాకూబ్, అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking