ప్రభుత్వ భూమిని కాపాడాలని పిర్యాదు చేసిన వ్యక్తి పై కబ్జాదారుల దాడి

ప్రభుత్వ భూమిని కాపాడాలని పిర్యాదు చేసిన వ్యక్తి పై కబ్జాదారుల దాడి

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ మిదికుంట చెరువును సర్వే నెంబర్ 139, 44/5 ల మధ్యనున్న ప్రభుత్వ భూమిని
సర్వే చేసి ,హద్దు బంధులు ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ భూమి అన్యాకృతం కావద్దని కబ్జాదారుల నుండి రక్షించాలని చెరువు కట్ట పునరుద్ధరించాలని గతంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మరియు రెవెన్యూ అధికారులకు ఆర్డిఓ కి ఎమ్మార్వో కి అనేక విన్నపాలు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో కలెక్టర్ కి కంప్లైంట్ చేసిన రాచమల్ల కృష్ణ పటేల్ గౌడ్ పైన కక్ష పెంచుకొని 11-04-2023 మంగళవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో కాపుగాసి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినటువంటి వారు ఐరన్ రాడ్లతో ప్రాణాలు పోయే విధంగా బాడీ లోపల ఉన్న అవయవాలు దెబ్బ తినే విధంగా తీవ్రంగా కొట్టి గాయపరచడాన్ని రామోస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు కృష్ణ పటేల్ గౌడ్ ని కొట్టిన వారి పైన సెక్షన్ 306, 307 క్రింద కేసులు బుక్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతూ గవర్నమెంట్ భూమి కబ్జాదారుల పైన తగిన చర్యలు తీసుకొని ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని , రెవెన్యూ డిపార్ట్మెంట్ ని తక్షణమే స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ గాయపడ్డ బాధితులకి న్యాయం జరిగే విధంగా చూడాలని లేనిపక్షంలో మా సంస్థ నుండి రాష్ట్ర మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి మేము అండగా నిలబడి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలియజేసుకుంటూ గతంలో ఈ యొక్క చెరువు కట్ట ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కాపాడాలని, కట్ట పై నుండి యధావిధిగా దారిని పునరుద్ధరించాలని గతంలోనే కలెక్టర్ ఆర్డీవో, స్థానిక ఎమ్మార్వోకు మరియు జోనల్ కమిషనర్, చందానగర్ సర్కిల్ 21 జి హెచ్ ఎం సి కమిషనర్ కు , ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకు పోవడం పై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ని కలిసి విన్నవించడంతో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్ కి లెటర్ రాసి, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి కబ్జా కాకుండా చూడాలని కోరిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కావున తక్షణమే సర్వే జరిపి గవర్నమెంట్ భూమిని అన్యాకృతం కాకుండా చూడవలసిందిగా కలెక్టర్ కి రెవిన్యూ డిపార్ట్మెంట్ కు సంతోష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking