రైతుల పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు
కోదాడ టౌన్ అక్షిత న్యూస్:
ఈరోజు పిఎసిఎస్ పరిధిలోని కొమరబండ, తొగర్రాయి, గణపవరం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను టిఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు అండగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఉంటాడని అన్నారు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు అన్నారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బుడిగం నరేష్ ,గుండపునేని ప్రభాకర్ రావు, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి గుజ్జబాబు, కమతం వెంకటయ్య, బొర్ర చంద్రమౌళి ,వట్టి సీతారామయ్య, సీఈఓ మంద వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాలలోని రైతులు సిబ్బంది పాల్గొన్నారు